మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్భణీ జిల్లా యశ్వాడీ గ్రామంలోని హనుమాన్ ఆలయ మండపం పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోగా, స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీశారు.


శనివారం కావడంతో ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పులోని కొంత భాగం, ఒక పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో అక్కడ ఉన్న భక్తులు భయాందోళనలకు గురయ్యారు.


ప్రమాదం అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న 25 మంది భక్తులను రక్షించి బయటకు తీశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *