Rythu Bharosa: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతులకు ఖాతాల్లో రూ.2,482 కోట్లు
వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది పట్టాదారు రైతులకు దశలవారీగా పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.










