శ్రీకాంత్ (Srikanth), లయ (Laya), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ప్రధాన పాత్రల్లో దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి (G. Nageswara Reddy) రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్ మిడిల్‌క్లాస్’ . ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఈ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో శ్రీకాంత్ ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబ వ్యక్తిగా కనిపించగా, ఆయన భార్య పాత్రలో లయ నటించారు.
ఇక రాజేంద్ర ప్రసాద్ వేంకటేశ్వరస్వామి పాత్రలో ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. ఈ టీజర్ ను ప్రేక్షకులు మూవీపై ఆసక్తిని చూపుతున్నారు. శ్రీకాంత్, లయ కాంబినేషన్ కావడంతో ఫ్యామిలీ అడియన్స్ ఈ మూవీపై భారీ అశలు పెట్టున్నారు. అయితే మూవీ రిలీజ్ తేదీపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు.