మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకార మూడో పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. రామ్‌చరణ్‌, ఉపాసన ఇద్దరూ క్లీంకారను ఎత్తుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 జూన్ 20న జన్మించిన క్లీంకార ఇటీవలే మూడేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక కూతురు క్లీంకార అంటే తనకు ఎంతో ఇష్టమని రామ్‌చరణ్ పలుమార్లు వెల్లడించారు. ఆమెకు స్వయంగా గోరుముద్దలు తినిపించడం తనకు చాలా ఆనందంగా ఉంటుందని, షూటింగ్‌ల సమయంలో ఆమెను ఎక్కువగా మిస్ అవుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అలాగే క్లీంకారతో ఉంటే మెగాస్టార్ చిరంజీవి కూడా చిన్నపిల్లాడిలా మారిపోతారని చరణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *