మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటించగా, సంగీత మాంత్రికుడు ఏఆర్. రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందించారు.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రంలోని పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించాయి. ముఖ్యంగా ‘చికిరి.. చికిరి’ పాట విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను ఊపేస్తోంది. ఈ పాట ఇప్పటికే కోట్లాది వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది.
తాజాగా చిత్ర బృందం ‘చికిరి.. చికిరి’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల నుంచి భారీ స్పందన అందుకుంటోంది.