సాయికృష్ణ(Sai Krishna) అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం నెలకొంది. ఈ కేసులో కృష్ణలంక(Krishna Lanka) పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ బాబూరావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన సమయంలో కానిస్టేబుల్ బాబూరావు అక్కడే ఉన్నట్లు ఆమె ఎస్‌ఐటీ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో బాబూరావును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో ఎన్ని రోజులు ఉంచారు, ఆ సమయంలో ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, కేసులో ఆయన పాత్ర ఏమిటి అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు సిబ్బందిని విచారించిన సిట్, అందుబాటులోకి వస్తున్న ఆధారాల మేరకు తదుపరి చర్యలు చేపడుతోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *