
ఐపీఎల్ (IPL) 2026లో మరో సంచలన రికార్డు నమోదైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ (Urvil Patel) తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు.
క్రీజులోకి అడుగుపెట్టిన క్షణం నుంచే లక్నో బౌలర్లపై ఊచకోత ప్రారంభించాడు.
దూకుడైన ఆటతీరుతో చెలరేగిపోయిన ఉర్విల్ పటేల్ కేవలం 13 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో ఉర్విల్ పటేల్ కేవలం ఒకే ఒక్క ఫోర్ మాత్రమే బాదగా, ఏకంగా 7 భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
అతని దూకుడు బ్యాటింగ్ ముందు లక్నో బౌలర్లు తేలిపోయారు. ఈ అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఉర్విల్ పటేల్ సమం చేశాడు.
2023 సీజన్‌లో కేకేఆర్‌పై యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) 13 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది చరిత్ర సృష్టించగా, ఇప్పుడు అదే ఫీట్‌ను ఉర్విల్ పటేల్ పునరావృతం చేసి జైస్వాల్ సరసన చేరాడు.