కాంగ్రెస్ (Indian National Congress) పార్టీ హైదరాబాద్ జిల్లా సమావేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ భవన్ (Gandhi Bhavan) లో నిర్వహించిన సమావేశంలో మంత్రులు పోన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే ఫీరోజ్ ఖాన్ (Feroz Khan), మరో నేత (ఉస్మాన్ అల్ హజ్రీ) Usman Al Hazri మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ప్రోటోకాల్ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ముఖ్యంగా అజహరుద్దీన్ పక్కన కూర్చోవడంపై వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా ఉస్మాన్ అల్ హజ్రీ ఫిరోజ్ ఖాన్‌ను నెట్టివేయడంతో ఆయన కిందపడిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఇద్దరి మధ్య జరిగిన ఈ ఘర్షణను ఆపేందుకు సీనియర్ నేత వి.హనుమంత్ రావు (V. Hanumantha Rao) జోక్యం చేసుకున్నారు. అయితే ఆయన్ను కూడా నెట్టివేసే పరిస్థితి ఏర్పడటంతో ఇతర నేతలు వెంటనే మధ్యలోకి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు
ఈ పరిణామాల అనంతరం మంత్రి అజహరుద్దీన్ సమావేశ స్థలం నుంచి వెళ్లిపోయారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
