డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసిన ఓ బాలుడి కోరిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సుమారు 40 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం పొందాడు. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పుడిల్ బ్రీడ్ కుక్కపిల్ల కావాలని పవన్ కళ్యాణ్‌ను కోరాడు. అంతేకాకుండా తనకు కావాల్సిన కుక్కపిల్ల ఫోటోను కూడా చూపిస్తూ తన కోరికను వివరించాడు. బాలుడి కోరికను ఆసక్తిగా విన్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు.


నిరంజన్‌కు అతను కోరుకున్న పుడిల్ బ్రీడ్ కుక్కపిల్లను అందించాలని జనసేన శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు హనుమకొండలో పుడిల్ బ్రీడ్ కుక్కపిల్లను కొనుగోలు చేసి నిరంజన్‌కు అందజేశారు. అంతేకాకుండా బాలుడి ఆనందాన్ని మరింత పెంచేందుకు ఒక మొబైల్ ట్యాబ్‌ను కూడా బహుమతిగా ఇచ్చారు.


తాను ఎంతోకాలంగా కోరుకున్న కుక్కపిల్ల చేతికి అందడంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్‌కు, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక చిన్నారి కోరికను వెంటనే నెరవేర్చిన పవన్ కళ్యాణ్ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *