పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ హౌస్ ‘భద్రకాళి’ పేరుతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించినట్లు వెల్లడించారు.

తాను తొలిసారి లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నానని విజయ్ తెలిపారు. “మీ అందరి కోర్కెలు తీరాలని అమ్మవారిని ప్రార్థించానని అన్నారు. బోనాల పండుగ సందర్భంగా విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా అమ్మవారిని దర్శించుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *