-Thalliki Vandanam: 'తల్లికి వందనం' రెండో విడత జమకు ముహూర్తం ఖరారు: వారికి ఆగస్టు 30న అకౌంట్లలో రూ.13 వేలు!

 

 

ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థుల చదువులకు నిలదొక్కుకునేలా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం’ పథకం అమలు వేగవంతమైంది. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందలేకపోయిన విద్యార్థులకు, కొత్తగా పాఠశాలల్లో చేరిన వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆగస్టు 30వ తేదీన అర్హులైన తల్లుల ఖాతాల్లో రెండో విడత సొమ్మును జమ చేయనున్నట్లు ప్రకటించింది.

తొలి విడత మిస్సయిన వారికి మరో అవకాశం:

ఈ ఏడాది మొదటి విడత నిధులను ఇప్పటికే అర్హుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ.. బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ కాకపోవడం, డేటా తప్పులు వంటి సాంకేతిక సమస్యల వల్ల కొంతమందికి డబ్బులు అందలేదు.

  • సచివాలయాల్లో తనిఖీ: తొలి విడతలో డబ్బులు రాని అర్హుల జాబితాను జులై 21న గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు.
  • దరఖాస్తుల స్వీకరణ: బాధితుల నుంచి ఆధారాలతో కూడిన అభ్యంతరాలను ఆగస్టు 7వ తేదీ వరకు స్వీకరించగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,470 దరఖాస్తులు వచ్చాయి.

ఆగస్టు 30న అర్హుల జాబితా & నిధుల విడుదల:

వచ్చిన దరఖాస్తులను అధికారులు ప్రస్తుతం పునఃపరిశీలిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హత సాధించిన విద్యార్థుల తుది జాబితాను ఆగస్టు 30న విడుదల చేసి, అదే రోజున తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ చేయనున్నారు (మిగిలిన రూ.2,000 స్కూల్/కళాశాల వికాస నిధికి కేటాయిస్తారు).

‘తల్లికి వందనం’ పథకానికి ఉండాల్సిన ముఖ్య అర్హతలు:

ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కుటుంబానికి క్రింది నియమాలు వర్తిస్తాయి:

  1. రేషన్ కార్డు: కుటుంబానికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు ఉండాలి.
  2. భూమి పరిమితి: గరిష్టంగా 10 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు.
  3. వాహనం: కుటుంబంలో ఎవరి పేరునా నాలుగు చక్రాల వాహనం (ఫోర్ వీలర్) ఉండకూడదు (టాక్సీ, ట్రాక్టర్, ఆటో మినహాయింపు).
  4. కరెంట్ బిల్లు: ఇంట్లో నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు.
  5. ఆస్తి పరిమితి: పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించి ఇల్లు లేదా స్థలం ఉండకూడదు.
  6. ఇన్‌కమ్ ట్యాక్స్: కుటుంబంలో ఎవరూ ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *