హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో చేసిన ఓ ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన డైరీలో రాసుకున్న విషయాలను అభిమానులతో పంచుకున్న సమంత.. తాను కోరుకున్న జీవితాన్ని ముందుగానే రాసుకుని, దాని కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చింది.

తనకు తాను ఇచ్చుకున్న 1000 రోజుల వాగ్దానంలో 484వ రోజున ఉన్నానని సమంత తెలిపింది. భవిష్యత్తులో తాను జీవించాలనుకునే జీవితాన్ని డైరీలో రాసుకుంటానని, వాటిలో కొన్ని తనకు కూడా చాలా పెద్దవిగా, అసాధ్యంగా అనిపించేవని పేర్కొంది. అయినప్పటికీ వాటిని రాసుకున్నానని.. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వాటిలో చాలా తన జీవితంలో నిజమయ్యాయని చెప్పింది.

కేవలం కలలు కనడం లేదా వాటిని రాసుకోవడం మాత్రమే సరిపోదని.. ఆ కలకు గడువు పెట్టుకుని, చుట్టూ ఉన్న శబ్దాన్ని పట్టించుకోకుండా కష్టపడి పనిచేస్తూ ముందుకు సాగాలని సమంత సూచించింది.

తన డైరీ పేజీలను తిరిగి చూసుకున్నప్పుడు.. ఒకప్పుడు తాను కోరుకున్నది నిజంగా సాధించగలనా అని అనుమానించిన తన పాత రూపాన్ని చూసినట్లు అనిపిస్తుందని చెప్పింది. “ఈరోజు మీ జీవితం ఎలా ఉన్నా.. దానికంటే పెద్దగా కలలు కనండి. నమ్మండి” అంటూ సమంత తన పోస్ట్‌ను ముగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *