అల్లరి నరేష్, సురభి జంటగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ తాజాగా విడుదలైంది. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.

టీజర్ ప్రకారం.. చిన్నతనంలో హీరోకు ఓ పుస్తకం దొరుకుతుంది. అందులో చెప్పిన విధంగా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి, మేనకలు భూమిపైకి వచ్చి కోరిన కోరికలు తీరుస్తారని తెలుస్తుంది. దీంతో హీరో ఏళ్ల తరబడి ఆ ప్రయత్నం చేస్తూ, వారి కోసం పూజలు చేస్తుంటాడు. చివరికి ఆ ముగ్గురు భూమిపైకి దిగడంతో హీరో జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే కథగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో రంభగా రాశి సింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకగా ప్రిషా సింగ్ నటించగా.. ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. టీజర్‌ను బట్టి అల్లరి నరేష్ మార్క్ కామెడీతో పాటు ఫాంటసీ అంశాలతో సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *