ఏపీలో నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపు

నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలపై కీలక అప్‌డేట్ వచ్చింది. సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 23న సినిమా విడుదలకు ఒక రోజు ముందుగా ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు.

ఈ షోలకు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.400, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.300గా నిర్ణయించారు.అలాగే సినిమా విడుదలైన తర్వాత తొలి 10 రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణ టికెట్ ధరలకు అదనంగా మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 పెంచుకునే అవకాశం కల్పించారు.

నాని, కయాదు లోహర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *