ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్‌ను ఇతరులకు చూపించకుండా కేవలం యూజర్ నేమ్ సాయంతోనే చాట్ చేయగలుగుతారు.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ (Instagram)), టెలిగ్రామ్ (Telegram) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో యూజర్‌నేమ్ ఆధారంగా వ్యక్తులను గుర్తించి సందేశాలు పంపే సదుపాయం ఉంది. ఇప్పుడు అదే తరహా ఫీచర్‌ను వాట్సాప్ కూడా తీసుకురానుంది.
ప్రైవసీకి మరింత రక్షణ
ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఎవరినైనా సంప్రదించాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరి. కానీ కొత్త ఫీచర్ ద్వారా యూజర్‌నేమ్‌తోనే ఇతరులను సెర్చ్ చేసి మెసేజ్ పంపే అవకాశం ఉంటుంది. దీంతో మీ ఫోన్ నెంబర్ ఇతరులకు కనిపించకుండా ఉంటుంది. ప్రత్యేకించి సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
ప్రస్తుతం బీటా యూజర్లకే
ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. పరీక్షలు పూర్తయిన తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
వాట్సాప్‌లో యూజర్ నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి?
వాట్సాప్ ఓపెన్ చేయండి
సెట్టింగ్ పై క్లిక్ చేయండి
మీ ఫ్రొపైల్ పేరు ఎంచుకోండి
అకౌంట్ డిటైల్స్ లోకి వెళ్లండి
యూజర్ నేమ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
మీకు నచ్చిన యూజర్ నేమ్ నమోదు చేయండి
యూజర్ నేమ్ 3 నుంచి 35 అక్షరాల మధ్య ఉండాలి
కనీసం ఒక అక్షరం, ఒక సంఖ్య, ఒక ప్రత్యేక గుర్తు ఉండాలి
యూజర్ నేమ్ అందుబాటులో ఉందో లేదో వాట్సాప్ పరిశీలిస్తుంది
అందుబాటులో ఉంటే సేవ్ లేదా డన్ పై క్లిక్ చేయండి
సైబర్ నేరాలకు అడ్డుకట్ట
ఇటీవలి కాలంలో వాట్సాప్ నెంబర్లను సేకరించి స్పామ్ లింకులు పంపడం, బ్యాంక్ ఖాతాలను టార్గెట్ చేయడం వంటి సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ నెంబర్‌ను గోప్యంగా ఉంచే యూజర్ నేమ్ ఫీచర్ యూజర్ల భద్రతను మరింత పెంచనుంది.
