Apple Pay: భారత్‌లో ‘యాపిల్ పే’ హల్‌చల్: త్వరలోనే ప్రారంభం కానున్న సేవలు.. పని చేసే విధానం, ఫీచర్లు ఇవే!

 

భారత్‌లోని ఐఫోన్ యూజర్లు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న Apple Pay సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వచ్చే సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్‌లో ఈ సేవలను అధికారికంగా ప్రారంభించేందుకు యాపిల్ సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన కీలక విశేషాలు మరియు టెక్నాలజీ వివరాలు ఇవే.

యాపిల్ పే ఎలా పనిచేస్తుంది?

  • NFC టెక్నాలజీ: ఈ సేవలు ప్రారంభమయ్యాక యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ వివరాలను ఐఫోన్‌లోని ‘Apple Wallet’ యాప్‌లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • కార్డ్-లెస్ పేమెంట్స్: షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు లేదా దుకాణాల్లో చెల్లింపులు చేసేటప్పుడు కార్డ్‌ను స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు.
  • ఈజీ ట్యాప్: POS (Point of Sale) మెషిన్ దగ్గర ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్‌ను ట్యాప్ చేస్తే ‘Near Field Communication’ (NFC) ద్వారా కొన్ని సెకన్లలోనే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.

ప్రారంభంలో క్రెడిట్ కార్డులకే ఛాన్స్: యాపిల్ పే మొదటి దశలో వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard) నెట్‌వర్క్‌లకు చెందిన క్రెడిట్ కార్డులకు మాత్రమే సపోర్ట్ ఇవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే మోడల్‌ను ఉపయోగిస్తున్న యాపిల్, భారత్‌లో కూడా ముందుగా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లపైనే దృష్టి పెట్టింది. డెబిట్ కార్డ్ సపోర్ట్‌పై రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.

UPI సేవలకు మరికొంత సమయం: భారత్‌లో డిజిటల్ పేమెంట్స్‌లో UPI హవా నడుస్తున్నప్పటికీ, యాపిల్ పే ప్రారంభంలో దీనికి UPI సపోర్ట్ ఉండదు.

  • UPI సేవలు అందించాలంటే NPCI (National Payments Corporation of India) అనుమతులతో పాటు ఒక స్పాన్సర్ బ్యాంక్‌తో భాగస్వామ్యం తప్పనిసరి.
  • ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాతే ఆపిల్ పేలో UPI ఆప్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

బ్యాంకులతో వినూత్న ఆదాయ ఒప్పందాలు: యాపిల్ పే ద్వారా జరిగే ప్రతి లావాదేవీపై యాపిల్ సంస్థకు కొంత రుసుము దక్కనుంది.

  • ప్రతి ట్రాన్సాక్షన్‌పై 15 నుండి 20 బేసిస్ పాయింట్ల (0.15% – 0.20%) వాటా ఇవ్వాలని యాపిల్ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది.
  • అయితే కొన్ని దిగ్గజ బ్యాంకులు దీనిని 10 బేసిస్ పాయింట్లకు (0.10%) పరిమితం చేయాలని కోరుతున్నట్లు సమాచారం.

కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల్లో కొత్త విప్లవం: యాపిల్ పే రాకతో దేశంలో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ వాడకం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని పేమెంట్ రంగా నిపుణులు భావిస్తున్నారు. పర్స్ లేదా ఫిజికల్ కార్డ్స్ వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా, ఐఫోన్ సెక్యూరిటీతో వేగంగా చెల్లింపులు చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *