ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో భారీ సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 2016లో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సరైనోడు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
దాదాపు పదేళ్ల తర్వాత ఈ హిట్ కాంబో మళ్లీ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి రొటీన్ మాస్ సినిమాకు బదులుగా పాన్ ఇండియా స్థాయిలో ఓ పౌరాణిక కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. బోయపాటి సిద్ధం చేసిన మైథలాజికల్ స్క్రిప్ట్ బన్నీకి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.
ఇవి పూర్తయ్యాక బోయపాటితో పౌరాణిక సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
