ఇన్‌స్టాగ్రామ్(Instagram) యూజర్లకు మెటా(Meta) కంపెనీ మరో కొత్త సర్ప్రైజ్ ఇచ్చింది. ‘ఇన్‌స్టాగ్రామ్ ప్లస్’ (Instagram Plus Subscription) అనే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అధికారికంగా తీసుకొచ్చింది. పర్సనలైజేషన్, అడ్వాన్స్‌డ్ షేరింగ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లను కోరుకునే యూజర్ల కోసం ఈ ఆప్షనల్ పేమెంట్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్(Subscription) తీసుకోకుండానే యాప్‌ను యథావిధిగా ఉచితంగా వాడుకోవచ్చు. అయితే, ‘ఇన్‌స్టాగ్రామ్ ప్లస్’ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ప్రత్యేకమైన ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో స్టోరీ షేరింగ్ కంట్రోల్స్, ఆడియన్స్ మేనేజ్‌మెంట్, ప్రొఫైల్ కస్టమైజేషన్ వంటి ఆకర్షణీయమైన ఆప్షన్లు ఉన్నాయి.

కంపెనీ ప్రకటన ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్‌ను మూడు ప్రధాన కేటగిరీలుగా విభజించారు. అవి సోషల్ కనెక్టివిటీ ఫీచర్లు, ఇన్‌సైట్స్ & ప్రివ్యూ టూల్స్, ప్రొఫైల్ కస్టమైజేషన్ ఫీచర్లు. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా ‘స్టోరీ స్పాట్‌లైట్’ అనే ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. దీని ద్వారా యూజర్ స్టోరీలను వారి స్నేహితుల స్టోరీ ఫీడ్‌లో ప్రత్యేకంగా హైలైట్ చేయవచ్చు. అంతేకాకుండా ‘మల్టిపుల్ స్టోరీ ఆడియన్సెస్’ అనే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా వేర్వేరు వ్యక్తుల కోసం కస్టమ్ ఆడియన్స్ లిస్టులు రూపొందించుకోవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న ‘క్లోజ్ ఫ్రెండ్స్’ ఫీచర్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా చెప్పవచ్చు.

అలాగే ‘స్టోరీ ఎక్స్‌టెండ్’ ఫీచర్ ద్వారా స్టోరీ వ్యవధిని 24 గంటల నుంచి 48 గంటల వరకు పెంచుకునే అవకాశం కూడా ఇస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ ప్లస్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ ‘సూపర్ హార్ట్స్’ ఫీచర్. దీని ద్వారా స్నేహితుల స్టోరీలకు రియాక్ట్ అయితే యానిమేటెడ్ హార్ట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీంతో స్టోరీ ఇంటరాక్షన్లు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త ఇన్‌సైట్స్ టూల్స్‌ను కూడా ప్లస్ ప్యాక్‌లో చేర్చారు. ఇందులో ‘స్టోరీ రీవాచ్ ఇన్‌సైట్స్’ ద్వారా ఒక స్టోరీని ఎన్ని సార్లు వీక్షించారో తెలుసుకోవచ్చు.

అలాగే ‘సెర్చ్ వ్యూయర్ లిస్ట్’ ఫీచర్ ద్వారా స్టోరీ వ్యూయర్ లిస్ట్‌లో నిర్దిష్ట అకౌంట్లను సులభంగా సెర్చ్ చేయవచ్చు. ఇంకా ‘స్టోరీ ప్రివ్యూ’ ఫీచర్‌ను కూడా పరిచయం చేశారు. దీని ద్వారా సబ్‌స్క్రైబర్లు స్టోరీని ఓపెన్ చేయకుండానే ప్రివ్యూ చూడగలరు. అయితే ఈ ప్రీమియం ప్లాన్‌కు సంబంధించిన అన్ని ఫీచర్ల పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *