sai Krishna - Murder Case

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ సాయి కృష్ణ లాక్‌అప్‌ డెత్‌ కేసులో నేడు కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌ను నేడు కోర్టులో మెన్షన్ చేసే అవకాశం ఉండటంతో, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే కానిస్టేబుళ్లు అశోక్, నాని అధికారుల ఎదుట సోమవారం లొంగిపోయారు.

మరోవైపు, హెడ్ కానిస్టేబుళ్లు నాని, సురేష్‌ను నేడు కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో నేటి విచారణలో హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై బాధిత కుటుంబంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *