తెలంగాణ(Telangana)లో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) ప్రభావం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)పై పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలు అంతరాయం ఎదుర్కొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు పలు విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.
ముంబయి, దిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. వర్షం, తక్కువ దృశ్యమానత కారణంగా విమానాల ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు లేవని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో కొన్ని విమానాలకు తాత్కాలికంగా ల్యాండింగ్ అనుమతి నిరాకరించగా, మరికొన్ని విమానాలను ప్రత్యామ్నాయ గమ్యస్థానాలకు దారి మళ్లించారు. విమానాల మళ్లింపు కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
