అస్సాం(Assam)లోని జోర్హాట్(Jorhat) వైమానిక స్థావరంలో శుక్రవారం విషాదకర విమాన ప్రమాదం(Plane crash) చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా బలగాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.


ఈ ఘటనలో పైలట్‌తో పాటు విమానంలోని ఇతర సిబ్బంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఘటనపై భారత వైమానిక దళం దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.

AN-32 విమానం ప్రత్యేకతలివే


AN-32 అనేది భారత వైమానిక దళం విస్తృతంగా వినియోగిస్తున్న రెండు ఇంజిన్లతో కూడిన శక్తివంతమైన టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా పనిచేసేలా దీనిని రూపొందించారు. ఎత్తైన పర్వత ప్రాంతాల ఎయిర్‌ఫీల్డ్‌లలో, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా ఈ విమానం సులభంగా కార్యకలాపాలు నిర్వహించగలదు.


ఈ విమానం ఒకేసారి సుమారు 7.5 టన్నుల సరుకును రవాణా చేయగలదు. అలాగే 50 మంది ప్రయాణికులు లేదా 42 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల సమయంలో మారుమూల ప్రాంతాలకు సహాయక సామగ్రిని చేరవేయడంలో AN-32 విమానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *