పశ్చిమ బెంగాల్ సర్కార్ మరో సంచలనానికి తెరలేపనున్నట్లు టాక్. గ్రంథాలయా సేవల మంత్రి గౌరీ శంకర్ ఘోష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 2025లో టీఎంసీ సర్కార్ పాఠశాల లైబ్రరీల కోసం 515 పుస్తకాలను ఆమోదించింది. వాటిలో 90 పుస్తకాలు మమతా బెనర్జీ రచించినవే.

ఆ పుస్తకాలను ప్రభుత్వం లైబ్రరీల నుంచి తొలగించే అవకాశం ఉందని సాక్షాత్తు గ్రంథాలయ సేవల మంత్రి గౌరీ శంకర్ ఘోష్ చెప్పారు. ‘ఎపాంగ్ ఓపాంగ్ ఝపాంత్’ వంటి పుస్తకాలకు లైబ్రరీలో చోటు లేదని స్పష్టం చేశారు. దీంతో మమతా బెనర్జీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అవ్వగా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అవినీతిపై విచారణ మొదలైంది. దీంతో పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తి నెలకొంది.

By Vadiyala VeeraBabu

జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. జాతీయం, అంతర్జాతీయం, క్రీడలు వంటి రంగాలకు సంబంధించి ప్రముఖ సంస్థల్లో వార్తలు రాసిన అనుభవం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *