Kylian Mbappe ఎంబాపె అరుదైన రికార్డు.. ఫ్రాన్స్ సెమీస్‌లోకి!

ఫిఫా ప్రపంచకప్-2026లో ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మొరాకోపై 2-0తో విజయం సాధించిన ఫ్రాన్స్ తరఫున ఎంబాపె, డెంబెలె గోల్స్ చేశారు. ఈ మ్యాచ్‌తో ఎంబాపె ప్రపంచకప్‌లో 20 మ్యాచ్‌ల్లో 20 గోల్స్ పూర్తి చేసి.. 30 ఏళ్లలోపు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గోల్డెన్‌ బూట్ రేసులో మెస్సి (8 గోల్స్)తో సమంగా నిలిచాడు.

మ్యాచ్ చివర్లో చీలమండ గాయంతో ఎంబాపె మైదానం వీడినా.. అనంతరం తాను క్షేమంగానే ఉన్నానని వెల్లడించాడు. మరో వైపు ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ నిర్ణయంపై VAR సమీక్ష ఎక్కువ సమయం తీసుకోవడాన్ని నార్వే స్టార్ ఇర్లింగ్ హాలాండ్ తప్పుబట్టాడు. “పెనాల్టీ కోసం ఐదు నిమిషాలు వేచి ఉండటం చాలా ఎక్కువ” అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *