ముంబై విమానాశ్రయంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కేరళకు చెందిన ఓ మోడల్ దొరికింది. దాదాపు దాని విలువ 11.82 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 2025లో మిస్సెస్ కేరళ పోటీదారైన 28 ఏళ్ల హర్ష సన్నీ బ్యాంకాక్ నుంచి ముంబై విమానాశ్రయంలో దిగింది.

ఈ క్రమంలో ఆ మోడల్ పై అనుమానం వచ్చిన అధికారులు ట్రాలీ బ్యాగ్ ను తనిఖీ చేయగా ఆకుపచ్చ రంగులో ఉన్న 12 ప్యాకెట్స్ బయటపడ్డాయి. నార్కో పరీక్షల్లో దానిని గంజాయిగా గుర్తించారు.

ఆ ప్యాకెట్ల బరువు 11 కేజీలు ఉండగా దాదాపు వాటి విలువ 11.82 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడిన గంజాయి ఎక్కడికి తీసుకెళ్తుందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

By Vadiyala VeeraBabu

జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. జాతీయం, అంతర్జాతీయం, క్రీడలు వంటి రంగాలకు సంబంధించి ప్రముఖ సంస్థల్లో వార్తలు రాసిన అనుభవం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *