తెలుగులో పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84)(Bharathiraja) కన్నుమూశారు. చెన్నైలో కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. భారత ప్రభుత్వం 2004లో ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

అలాగే చివరిసారిగా మోహన్ లాల్ నటించిన “తుడురమ్” సినిమాలో ఆయన కనిపించారు. 1941 జులై 17న జన్మించిన ఆయన 1977లో ఓ తమిళం మూవీతో దర్శకుడిగా మారారు. “కొత్త జీవితాలు” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించగా అవి బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి.

ఆరు జాతీయ అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. “సీతాకోకచిలుక” అనే సినిమాకు నేషనల్ అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. నటి రాధిక నటించిన “తాయ్ కిలవి ” సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని ప్రోత్సహించగా వస్తే మీ పాదాల దగ్గర పెడతానని నటి రాధిక అన్నారు. కాగా గత ఏడాది ఆయన తనయుడు నటుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో మరణించాడు. భారతిరాజా మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *