హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో AAFA Annual Summit 2026 పేరిట భారీ ఫ్యాన్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర సహా 7 రాష్ట్రాల నుంచి దాదాపు 1000 మంది అభిమానులు తరలివచ్చారు.
వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన అభిమానుల కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుదీర్ఘంగా 6 గంటల పాటు నిలబడి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి ఓపికగా ఫొటోలు దిగారు. వారికి ప్రత్యేకంగా రుచికరమైన భోజన వసతి కల్పించడంతో పాటు మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని అందించారు.
అంతేకాకుండా, సినిమాలు విడుదలయ్యే సమయంలో థియేటర్ల వద్ద సందడి చేసే అభిమానుల భద్రత, వారి కుటుంబాల భవిష్యత్తు ఎంతో ముఖ్యమని భావించిన బన్నీ వారికి ఉచితంగా ప్రమాద బీమా (Accident Insurance) ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు రూ. 5 లక్షలు, జిల్లా కమిటీ సభ్యులకు రూ. 3 లక్షల ప్రమాద బీమా కార్డులను అందజేశారు.
అభిమానాన్ని వాడుకోవడమే కాకుండా వారి కుటుంబాలకు అండగా నిలిచి బన్నీ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రముఖులు కొనియాడుతున్నారు
