వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయినప్పటికీ అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కు రిషబ్ పంత్(Rishabh Pant) ఎంపిక కావడం విశేషం. అంతేకాకుండా తుది జట్టులోనూ స్థానం దక్కించుకోవడంతో అతడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో జరిగిన ఈ మ్యాచ్ పంత్ కెరీర్‌లో 50వ టెస్టుగా నిలిచింది. దీంతో భారత్ తరఫున 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన వికెట్ కీపర్ల జాబితాలో అతడు చేరాడు.

భారత వికెట్ కీపర్లలో అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోని(MS Dhoni) 90 టెస్టులతో అగ్రస్థానంలో ఉండగా, సయ్యద్ కిర్మాణి 88 టెస్టులతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు రిషభ్ పంత్ కూడా తన పేరును నమోదు చేసుకున్నాడు.

ఇక టెస్టు క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన వికెట్ కీపర్లలో రిషభ్ పంత్ 34వ స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు కేవలం ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే 100కు పైగా టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారు.

దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం మార్క్ బౌచర్ 147 టెస్టులతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలే 119 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఎంఎస్ ధోని, ఆడమ్ గిల్‌క్రిస్ట్, రాడ్ మార్ష్, అలన్ నాట్, బెర్ట్ ఇవాన్స్ తదితరులు 90కి పైగా టెస్టులు ఆడిన ప్రముఖ వికెట్ కీపర్ల జాబితాలో చోటు సంపాదించారు.

 

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *