“చిరంజీవి అంటే నా ప్రాణం”.. బండ్ల గణేశ్ ఎమోషనల్ కామెంట్స్
“చిరంజీవి అంటే నా ప్రాణం”.. బండ్ల గణేశ్ ఎమోషనల్ కామెంట్స్
“చిరంజీవి అంటే నా ప్రాణం”.. బండ్ల గణేశ్ ఎమోషనల్ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను భావోద్వేగానికి గురి చేశాయి. “చిరంజీవి అంటే నాకు ప్రాణం” అంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని బండ్ల గణేశ్ వేదికపై పంచుకున్నారు.
చిరంజీవి కేవలం స్టార్ హీరో మాత్రమే కాదని, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వ్యక్తిత్వమని ఆయన కొనియాడారు. కష్టపడి ఎదగాలనే కలను లక్షల మందిలో నింపిన వ్యక్తి చిరంజీవేనని అన్నారు.
చిరంజీవి ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే నా లాంటి సామాన్యులు సినిమాల్లోకి వచ్చేవాళ్లు కాదు. కష్టపడితే ఎవరైనా పైకి రావచ్చనే నమ్మకాన్ని ఇచ్చింది ఆయనేనని బండ్ల గణేశ్ భావోద్వేగంగా చెప్పారు.
అంతేకాదు, చిరంజీవి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు ఆదర్శంగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
[…] మరో స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అందుకే సినీ అభిమానులు తరచూ చెప్పే […]