అమెరికాఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) కీలక నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌కు సుమారు 2 టన్నుల బంగారం తరలించినట్లు సమాచారం.

అమెరికా ఆంక్షల కారణంగా పలు దేశాల బ్యాంకుల్లో ఇరాన్‌ నిధులు స్తంభించిపోయాయి. ఈ నిధుల్లో కొంత భాగాన్ని విడుదల చేసి ఇరాన్‌ను యుద్ధానికి దూరంగా ఉంచేందుకు UAE ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 11, 12 తేదీల్లో అబుధాబి నుంచి టెహ్రాన్‌కు విమానాలు నడిచినట్లు సమాచారం.

ఇరాన్‌కు తరలించిన నిధుల్లో సుమారు 283 మిలియన్‌ డాలర్ల విలువైన రెండు టన్నుల బంగారం కూడా ఉన్నట్లు కథనాలు వెల్లడించాయి. అంతేకాదు.. ఇరాన్‌ విమానయాన సంస్థలకు 15 సెకండ్‌హ్యాండ్‌ విమానాలను విక్రయించేందుకు UAE అంగీకరించినట్లు తెలుస్తోంది.

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలు ప్యాసింజర్‌ విమానాలు ధ్వంసమైన నేపథ్యంలో.. ఈ విమానాలు ఆ లోటును భర్తీ చేయనున్నాయి.

అయితే.. ఇరాన్‌కు UAE ఇంత పెద్ద మొత్తంలో సాయం చేయడం వెనుక ప్రధాన కారణం తమ భూభాగంపై ఇరాన్‌ దాడులను నివారించడమేనని అంతర్జాతీయ విశ్లేషణలు పేర్కొంటున్నాయి.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *