సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. 14 ఏళ్ల పాటు కొనసాగిన సిరియా అంతర్యుద్ధం సందర్భంగా యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో అసద్‌ను కోర్టు దోషిగా తేల్చినట్లు సమాచారం. ఈ అంతర్యుద్ధంలో సుమారు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

అసద్ తమ్ముడు, మాజీ సిరియా సైనిక అధికారి మహెర్ అల్ అసద్‌కు కూడా ఇదే కేసులో మరణశిక్ష విధించారు. అసద్ బంధువు అతీఫ్ నజీబ్‌కు సైతం కోర్టు అదే శిక్ష విధించినట్లు తెలుస్తోంది.

కాగా.. 2024 డిసెంబర్‌లో ఇస్లామిస్ట్ నేతృత్వంలోని బలగాలు అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. డమాస్కస్‌ను తిరుగుబాటు బలగాలు చుట్టుముట్టడంతో అసద్ తన కుటుంబంతో కలిసి సిరియా నుంచి రష్యాకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న అసద్‌కు కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *