ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల తల్లులకు బిగ్ అప్‌డేట్ అందించింది. ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేసింది. బుధవారం నుంచే లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను విడతల వారీగా జమ చేయడం ప్రారంభించిన సర్కార్, జూలై 24వ తేదీ నాటికి అర్హులందరికీ డబ్బులు పడేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొందరికి జమ కాగా, ఈ రెండు రోజుల్లో మిగిలిన వారందరి ఖాతాల్లోకి సొమ్ము జమ కానుంది.
నిధులు పడకపోతే ఏం చేయాలి?
మీకు అర్హత ఉండి కూడా ఖాతాలో డబ్బులు పడకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే మీ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
- జాబితా తనిఖీ: సచివాలయాల్లో ప్రదర్శించిన అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి.
- ఫిర్యాదు చేసే అవకాశం: పేరు లేకపోయినా లేదా డబ్బులు జమ కాకపోయినా సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ (Welfare Assistant) ను కలిసి గ్రీవెన్స్ (Grievance) నమోదు చేయవచ్చు.
పథకానికి కావలసిన అర్హతలు:
- చదువు: ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు.
- రేషన్ కార్డు: చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు తప్పనిసరి.
- ఆదాయ పరిమితి: గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000 మించకూడదు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు కలదు).
- విద్యుత్ వాడకం: ఇంట్లో నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి.
- వాహనాలు: ఆటో, ట్రాక్టర్, టాక్సీ మినహా ఇతర ఫోర్ వీలర్స్ (కార్లు మొదలైనవి) ఉండకూడదు.
- ఇంటి స్థలం: పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించి స్థలం ఉండకూడదు.
- ఇతర నియమాలు: ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇన్‌కమ్ టాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు.
సచివాలయంలో గ్రీవెన్స్ (ఫిర్యాదు) ఎలా నమోదు చేయాలి?
- గ్రామ లేదా వార్డు సచివాలయానికి నేరుగా వెళ్లాలి.
- తల్లి మరియు విద్యార్థి ఆధార్ కార్డ్ వివరాలు అందించాలి.
- చైల్డ్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ (Child Enrollment ID) సమర్పించాలి.
- మీకు అనర్హత రావడానికి గల కారణాన్ని (System Error) ఎంచుకుని, దానికి సంబంధించిన ఆధార పత్రాలను అప్‌లోడ్ చేయించాలి.
- బయోమెట్రిక్ లేదా OTP వెరిఫికేషన్ పూర్తి చేసి ఫిర్యాదును సబ్మిట్ చేయాలి.
