ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధులను కూటమి ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను మొత్తం రూ. 10,120.78 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
పథకానికి సంబంధించిన ముఖ్య విషయాలు:
- మొత్తం సాయం: ప్రతి విద్యార్థికి రూ. 15,000 వర్తిస్తుంది.
- జమ అయ్యే విధానం:
- లబ్ధిదారులైన తల్లుల/సంరక్షకుల ఖాతాల్లో రూ. 13,000 నేరుగా జమ అవుతాయి.
- మిగిలిన రూ. 2,000 విద్యార్థి చదువుతున్న పాఠశాల మెయింటెనెన్స్ అకౌంట్‌లో జమ చేస్తారు.
- రెండు విడతల్లో పంపిణీ:
- తొలి విడత: ఇప్పటికే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు నిధులు జమ అవుతాయి.
- రెండో విడత: ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు తదుపరి విడతలో నిధులు విడుదల చేస్తారు.
మీ పేమెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి?
మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి ఈ కింది సులభమైన స్టెప్స్ ఫాలో అవ్వండి:
- ముందుగా అధికారిక వెబ్‌సైట్
bm.sgsw.ap.gov.inను ఓపెన్ చేయండి. - హోమ్‌పేజీలో ఉన్న ‘Status Check’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- Scheme Type లో ‘Thalliki Vandanam’ అని సెలెక్ట్ చేసుకోండి.
- లబ్ధిదారు నిబంధనల ప్రకారం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP, అలాగే స్క్రీన్‌పై ఉన్న Captcha కోడ్‌ను నమోదు చేయండి.
- సబ్‌మిట్ చేయగానే మీ Payment Status స్క్రీన్‌పై కనిపిస్తుంది.
గమనిక: స్క్రీన్‌పై Success / Payment Released అని వస్తే నగదు జమ అయినట్లే. ఒకవేళ Pending లేదా Inactive NPCI అని వస్తే.. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్/NPCI మ్యాపింగ్ పూర్తి కాలేదని అర్థం. వెంటనే బ్యాంక్‌ను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
