ఇండియన్ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ చరిత్రలో తొలిసారి ఓ క్రికెటర్ హోస్ట్‌గా రానున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బిగ్‌బాస్ బెంగాలీ సీజన్-3కు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు జియోహాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది.
సెప్టెంబర్‌లో ఒకేసారి ఆరు భాషల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్లు ప్రారంభం కానుండగా.. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్ హోస్ట్‌లుగా కొనసాగనున్నారు.
ఇక బెంగాలీ బిగ్‌బాస్ కోసం గంగూలీకి రూ.125 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. గతంలో ‘దాదాగిరి అన్లిమిటెడ్’ షోతో సక్సెస్ఫుల్ హోస్ట్‌గా గుర్తింపు పొందిన గంగూలీ.. ఇప్పుడు బిగ్‌బాస్‌తో మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు.