Lexus ES 350h హైదరాబాద్‌లో లాంచ్.. రూ.66.10 లక్షల నుంచి ధర

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Lexus India హైదరాబాద్‌లో తన సరికొత్త Lexus ES 350h లగ్జరీ సెడాన్‌ను అధికారికంగా విడుదల చేసింది. జూబ్లీ హిల్స్‌లోని Lexus Hyderabad షోరూమ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కారును ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి Lexus India జోనల్ హెడ్‌లు ఆశిష్ సన్, మనూ శర్మ, అలాగే Lexus Hyderabad మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్, డైరెక్టర్ నిహారిక హాజరయ్యారు.

కొత్త Lexus ES 350hలో 2.5 లీటర్ సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ పవర్‌ట్రెయిన్ మెరుగైన పనితీరు, అధిక మైలేజ్, తక్కువ ఉద్గారాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. అదనంగా, ఈ మోడల్‌కు పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

భారత మార్కెట్‌లో Lexus ES 350h ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.66.10 లక్షలుగా నిర్ణయించారు. టెస్ట్ డ్రైవ్‌లు, మరిన్ని వివరాల కోసం జూబ్లీ హిల్స్‌లోని Lexus Hyderabad షోరూమ్‌ను సంప్రదించాలని కంపెనీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *