lenin: బాక్సాఫీస్ దగ్గర 'అయ్యగారి' విధ్వంసం.. రూ.100 కోట్ల క్లబ్‌ వైపు 'లెనిన్' జైత్రయాత్ర

Lenin :బాక్సాఫీస్ దగ్గర ‘అయ్యగారి’ విధ్వంసం.. రూ.100 కోట్ల క్లబ్‌ వైపు ‘లెనిన్’ జైత్రయాత్ర!

అక్కినేని అభిమానులు గత పదేళ్లుగా ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారో, ఆ కలను నెరవేరుస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు ‘అయ్యగారు’ అఖిల్ అక్కినేని. ఆయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది. జులై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజు నుంచే కలెక్షన్ల సుడిగాలిని తలపిస్తూ రెండో వారంలోనూ అదే జోరును కొనసాగిస్తోంది.

విడుదలైన మొదటి రోజే ఏకంగా రూ.16.7 కోట్ల భారీ గ్రాస్ రాబట్టి అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’, ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు. హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 67.2 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ మార్క్‌ను క్రాస్ చేసింది.

వీక్‌డేస్‌లోనూ డీసెంట్ నంబర్స్ నమోదు చేసిన ఈ చిత్రం, సెకండ్ వీకెండ్‌లోనూ మళ్లీ వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 10 రోజుల్లో రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రం త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని, రూ.100 కోట్ల మైలురాయికి చేరువవుతున్న క్షణాలను ఘనంగా వేడుక చేసుకోవడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ‘బ్లాక్ బస్టర్ వైభవం’ పేరిట భారీ సక్సెస్ మీట్‌ను నిర్వహించనున్నారు.

 

ఈ వేడుకకు అక్కినేని నాగార్జున, నాగచైతన్య ముఖ్య అతిథులుగా హాజరై అఖిల్‌తో పాటు ‘లెనిన్’ చిత్రబృందాన్ని అభినందించనున్నారు. అఖిల్ కెరీర్‌లోనే ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిన ‘లెనిన్’ విజయంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *