ఇంటికి కావలసిన నిత్యావసర సరుకుల నుంచి దుస్తుల వరకు.. అన్నీ ఒకే చోట దొరికే ఏకైక కేంద్రం ‘డీమార్ట్’ (DMart). తక్కువ ధరలు, ఆకర్షణీయమైన డిస్కౌంట్ల వల్ల మధ్యతరగతి ప్రజలకు ఇది కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే డీమార్ట్‌కు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే విపరీతమైన రద్దీ ఎదురవ్వడమే కాకుండా, మంచి ఆఫర్లను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది.
షాపింగ్ బిల్లు తగ్గించుకుంటూ, ప్రశాంతంగా షాపింగ్ చేయడానికి కొన్ని సీక్రెట్ టిప్స్ ఇవే:
డీమార్ట్‌లో ఆఫర్లు ఏ రోజుల్లో ఎక్కువగా ఉంటాయి?
సాధారణంగా వారంతాల్లో (శని, ఆదివారాల్లో) డీమార్ట్‌లో భారీగా అమ్మకాలు జరుగుతాయి.
- సోమవారం బెస్ట్ ఛాయిస్: ఆదివారం స్టాక్ ఖాళీ అయిన తర్వాత, సోమవారం రోజున సరికొత్త ఆఫర్లు మరియు అదనపు డిస్కౌంట్లను అందుబాటులోకి తెస్తారు. కాబట్టి సోమవారం షాపింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
- యాప్ చెక్ చేయండి: నేరుగా స్టోర్‌కు వెళ్లేముందు ‘DMart Ready’ యాప్‌ను ఒకసారి పరిశీలించండి. కొన్నిసార్లు డైరెక్ట్ స్టోర్ల కంటే యాప్‌లోనే ప్రత్యేక కూపన్లు, తక్కువ ధరలు మరియు ఆఫర్లు లభిస్తాయి.
రద్దీ లేకుండా ప్రశాంతంగా షాపింగ్ చేయడానికి సరైన సమయం:
- వారంలో ఉత్తమ రోజులు: శుక్రవారం నుంచి ఆదివారం వరకు తీవ్రమైన రద్దీ ఉంటుంది. కాబట్టి సోమవారం నుంచి గురువారం మధ్య వెళ్లడం సురక్షితం.
- సరైన సమయం:
- ఉదయం స్టోర్ తెరిచిన వెంటనే వెళ్తే రద్దీ లేకుండా వేగంగా షాపింగ్ పూర్తి చేయవచ్చు.
- మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 3:00 గంటల మధ్య కూడా కస్టమర్ల రద్దీ తక్కువగా ఉంటుంది.
- సాయంత్రం వేళల్లో జనం ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ సమయంలో వెళ్కపోవడమే మంచిది.
- నెలలో ఉత్తమ తేదీలు: ప్రతి నెలా మొదటి వారంలో జీతాలు రావడం వల్ల రద్దీ గరిష్టంగా ఉంటుంది. కాబట్టి నెలలోని 10వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య షాపింగ్ ప్లాన్ చేసుకుంటే తోపులాట లేకుండా సాఫీగా కొనుగోలు చేయవచ్చు.
