పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం పురాణాలు, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలను మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో ప్రభాస్‌ భైరవగా, కర్ణుడిగా కనిపించగా.. అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌గా, దీపికా పదుకొనె సుమతిగా నటించారు. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ‘కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగం కావాలనుకునే ఔత్సాహిక నటీనటులకు మేకర్స్‌ అదిరిపోయే అవకాశం కల్పించారు. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారి కోసం అధికారికంగా కాస్టింగ్‌ కాల్‌ ప్రకటించారు.

“ఆస్పైరింగ్‌ యాక్టర్స్‌ అందరికీ ఇదో మంచి అవకాశం. కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం కండి” అంటూ మేకర్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆసక్తి ఉన్న నటీనటులు తమ ప్రొఫైల్‌, నటనకు సంబంధించిన వివరాలను kalkiuniversecasting@gmail.comకు పంపించవచ్చు.

నాగ్‌ అశ్విన్‌ సృష్టించిన ‘కల్కి’ యూనివర్స్‌ను మరింత విస్తరించేలా సీక్వెల్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రెండో భాగంలో కథ మరింత ఆసక్తికరంగా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ వంటి స్టార్‌ కాస్ట్‌తో భారీ క్రేజ్‌ సంపాదించిన ఈ యూనివర్స్‌లో కొత్త నటీనటులకు అవకాశం కల్పించడంతో.. నటన రంగంలోకి రావాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్‌గా మారింది.

కల్కి యూనివర్స్‌లో నటించే అవకాశం కోసం ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను పై మెయిల్‌ అడ్రస్‌కు పంపించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *