‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో పూనకాలు తెప్పించిన ప్రభాస్.. థియేటర్లు షేక్ అయ్యే డేట్ వచ్చేసింది!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా హిస్టారికల్ వార్ డ్రామా ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఫిక్షనల్ హిస్టారికల్ లవ్ డ్రామాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.”అజ్ఞాతపర్వం ముగిసింది. తిరుగుబాటు మొదలవుతోంది” అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో వదిలిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పోస్టర్‌లో ప్రభాస్ శవాల మధ్య షర్ట్‌లెస్ అవతారంలో ఒక బండరాతిపై కూర్చొని కనిపించారు.ఒంటిపై జంధ్యం, రక్తం మరకలతో నిండిన చేతిలో భారీ తుపాకీ పట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ రాగా, తాజాగా విడుదలైన ఈ సాలిడ్ అప్‌డేట్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

‘ఫౌజీ’ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్ ఎస్మాయిల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాజేష్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తుండగా, కమల్ కణ్ణన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎడిటింగ్‌ను కోటగిరి వెంకటేశ్వరరావు చేపట్టారు. టీ-సిరీస్, గుల్షన్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *