అయ్యంగారే నెం.1’..ఈ ఒక్క మాట సోషల్ మీడియాను ఎంతలా షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే!ఏకంగా అక్కినేని అఖిల్ పేరునే ‘అయ్యగారు’గా మార్చేంతలా ఈ డైలాగ్ జనాల్లోకి దూసుకెళ్లింది.
అయితే తనకి అంతటి క్రేజీ ల్యాండ్ మార్క్ నేమ్ తెచ్చిన ఆ కల్ట్ ఫ్యాన్‌ను ఎట్టకేలకు కలిశారు హీరో అఖిల్ అక్కినేని (Akkineni Akhil): . గుంటూరులో జరిగిన ‘లెనిన్’ సక్సెస్ మీట్ వేదికగా ఈ అద్భుతమైన క్షణం చోటుచేసుకుంది.
ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత అఖిల్.. తన వీరాభిమాని నాగరాజును ప్రత్యేకంగా కార్వాన్ లోకి పిలిపించుకున్నారు. లోపలికి రాగానే నాగరాజు ఆనందంతో అఖిల్ కాళ్ల మీద పడబోగా.. వద్దంటూ అఖిల్ అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని హగ్ చేసుకున్నారు! ఇప్పుడు హ్యాపీగా ఉన్నావ్ కదా.. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరొచ్చింది” అని అఖిల్ అనడంతో ఆ కల్ట్ ఫ్యాన్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇదే క్రేజీ మూమెంట్‌లో అఖిల్ తన భార్య జైనబ్‌ను కూడా నాగరాజుకు పరిచయం చేయడం విశేషం.మొత్తానికి “మోస్ట్ ఫేమస్ అయ్యగారు.. ఫైనల్‌గా తన అయ్యగారును కలిశారు” అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక సాదాసీదా అభిమాని ప్రేమను అఖిల్ గౌరవించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
