యంగ్ హీరోహీరోయిన్లు అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు థియేటర్లలో విడుదల చేస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లకు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా చిత్రబృందం అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది. లవ్, కామెడీ, ఎమోషన్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

ముఖ్యంగా అన్షు, వాసవి గణేషన్ మధ్య కెమిస్ట్రీ, యూత్‌ను ఆకట్టుకునే డైలాగ్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

‘హుషారు పిట్టలు’ చిత్రం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *