అవును, బుల్లితెరపై రికార్డుల రారాజుగా నిలిచిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ మళ్లీ సందడి చేసేందుకు గ్రాండ్‌గా సిద్ధమైంది. ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి, ఒకే నెలలో ఆరు భాషల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్లు షురూ కాబోతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ డిజిటల్ దిగ్గజం జియోస్టార్ (JioStar) అధికారికంగా ప్రకటించింది. రాబోయే సెప్టెంబరు నుంచే ఈ ఎంటర్టైన్మెంట్ పండగ మొదలుకానుంది!
స్టార్ హోస్ట్‌ల హంగామా!
ఈసారి వేదికపై గ్లామర్, డ్రామా పీక్స్‌లో ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఆరుగురు సూపర్స్టార్లు ఈ ఆరు భాషల్లో హోస్ట్‌లుగా సందడి చేయనున్నారు.
- హిందీలో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తనదైన మాస్ స్టైల్‌తో అలరించబోతున్నారు.
- తెలుగులో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా మళ్లీ రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు.
- తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి బాధ్యతలు తీసుకోనున్నారు.
- కన్నడలో శాండల్‌వుడ్ బాద్షా కిచ్చా సుదీప్ నడిపించనున్నారు.
- మలయాళంలో మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ సందడి చేయనున్నారు.
- ఇక బెంగాలీ వెర్షన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం!
‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ కాఫీ టేబుల్ బుక్
ఈ మెగా అనౌన్స్మెంట్ సందర్భంగా జియోస్టార్ ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ పేరుతో ఒక ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించింది. గత రెండు దశాబ్దాలుగా బిగ్‌బాస్ సాగించిన అద్భుతమైన ప్రయాణం, సమాజంపై ఈ షో చూపిన సాంస్కృతిక ప్రభావం మరియు కార్పొరేట్ బ్రాండ్లకు ఇది కల్పించిన మార్కెటింగ్ అవకాశాలపై సమగ్ర విశ్లేషణను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
హిస్టరీలోనే అతిపెద్ద రికార్డు!
ఇండియన్ టీవీ చరిత్రలోనే ఒకే నెలలో ఆరు వేర్వేరు భాషల్లో కొత్త సీజన్లు లాంచ్ చేయడం ఇదే తొలిసారి. ఇది షో చరిత్రలోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిపోతుందని జియోస్టార్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్ డిజైనింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కాబట్టి గెట్ రెడీ బిగ్‌బాస్ ఫ్యాన్స్… సెప్టెంబరు నుంచి ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ మొదలుకాబోతోంది!
