ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ (Samsung) మరోసారి ఉద్యోగ కోతలతో వార్తల్లో నిలిచింది. అమెరికాలోని తన ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్న నేపథ్యంలో వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

సమాచారం ప్రకారం.. న్యూజెర్సీలో పనిచేస్తున్న సుమారు 739 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. వీరిలో కొందరికి టెక్సాస్‌కు రీలొకేషన్ ఆఫర్లు ఇవ్వగా, మరికొందరిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

ఇక టెక్సాస్‌లోని శాంసంగ్ కార్యాలయంలో మొబైల్ డివిజన్‌కు చెందిన మరో 100 మంది ఉద్యోగులను కూడా తొలగించినట్లు సమాచారం. ముఖ్యంగా డిస్‌ప్లే, మొబైల్ ఫోన్ విభాగాల్లోనే ఈ లేఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. కృతిమ మేధ (AI) కారణంగా సెమీకండక్టర్ వ్యాపారం మంచి లాభాలు తెచ్చిపెడుతున్నప్పటికీ, చిప్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ, ధరల ఒత్తిడి కంపెనీపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అదే సమయంలో తక్కువ పన్నులు, వ్యాపార అనుకూల విధానాల కారణంగా టెక్సాస్ టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. శాంసంగ్‌తో పాటు టెస్లా, ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను అక్కడికి విస్తరిస్తున్నాయి.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *