వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ టేట్(Andrew Tate), ట్రిస్టన్ టేట్(Tristan Tate) సోదరులను అమెరికాలోని మయామీలో పోలీసులు అరెస్టు చేశారు. మహిళలపై అత్యాచారం, అక్రమ మానవ రవాణా ఆరోపణలకు సంబంధించిన అంతర్జాతీయ న్యాయ ప్రక్రియలో భాగంగా యూఎస్ మార్షల్ సర్వీస్ వారిని అదుపులోకి తీసుకుంది.

అధికారుల సమాచారం ప్రకారం.. 2010 నుంచి 2017 మధ్యకాలంలో మహిళలపై లైంగిక దాడులు, అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై బ్రిటన్‌లో నమోదైన కేసులకు సంబంధించి ఈ చర్యలు చేపట్టారు. బ్రిటన్ అధికారుల అభ్యర్థన మేరకు అరెస్టు చేసినట్లు యూఎస్ మార్షల్ సర్వీస్ వెల్లడించింది.

అమెరికా, బ్రిటన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన టేట్ సోదరులు 2016లో రొమేనియాకు వెళ్లారు. అక్కడ కూడా ఇదే తరహా ఆరోపణలపై 2022లో అరెస్టయ్యారు. అనంతరం న్యాయపరమైన షరతులతో గత ఏడాది రొమేనియా నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి లభించడంతో అమెరికాలోని ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఇప్పుడు బ్రిటన్‌కు సంబంధించిన కేసుల నేపథ్యంలో వారిని మరోసారి అదుపులోకి తీసుకున్నారు. వచ్చే వారం మయామీ ఫెడరల్ కోర్టులో వారిని హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అయితే, ఈ ఆరోపణలపై టేట్ సోదరులు గతంలోనే తమకు ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని ఆరోపణలను ఖండిస్తున్నామని ప్రకటించారు. కేసు ప్రస్తుతం న్యాయ విచారణలో ఉంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *