ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ విభాగాల్లో జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.


అర్హతలు ఇవే..


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చార్టర్డ్ అకౌంటెంట్ (CA), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA), ఎంబీఏ (ఫైనాన్స్) లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఆర్థిక రంగంలో తగిన అనుభవం కూడా కలిగి ఉండాలి.

వయోపరిమితి


దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయస్సు చివరి తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం


అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో BSNL అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2026 జూన్ 24 ఉదయం 10 గంటల వరకు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి రూ.1,000 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.


ఎంపిక ఎలా ఉంటుంది?


ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రెజెంటేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు


ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.2,25,000 వేతనం అందజేస్తారు. అదనంగా ప్రతి ఏడాది 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వారికి BSNL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా చెప్పవచ్చు. అర్హతలు కలిగిన అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *