గత కొంతకాలంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితుల వల్లే బులియన్ మార్కెట్‌లో ఈ ఊహించని మార్పులు వస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిన్నటివరకు పెరిగిన ధరలు నేడు కాస్త శాంతించాయి. ఒక్కరోజే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై దాదాపు రూ.300 వరకు ధర తగ్గింది. జులై 17 ఉదయం సమయానికి నమోదైన వివరాల ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో ధరలు:
- 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,280
- 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,340
- వెండి (1 కిలో): రూ.2,39,900
విజయవాడలో ధరలు:
- 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,280
- 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,340
- వెండి (1 కిలో): రూ.2,39,900
