అమెరికన్లకు రష్యా భారీ ఆఫర్.. $26 వేల బోనస్‌, నెలకు $2 వేల జీతం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine War) నాలుగేళ్లకు పైగా కొనసాగుతోంది. ఇటీవల ఇరుదేశాలు పరస్పరం దాడులను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో రష్యా సైన్యంలో విదేశీయుల నియామకంపై మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అమెరికన్లను కూడా సోషల్ మీడియా ద్వారా ఆకర్షించి రష్యా సైన్యంలోకి నియమిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.

అమెరికా జాతీయులకు 26,000 డాలర్ల వరకు సైనింగ్ బోనస్‌, నెలకు 2,000 డాలర్ల జీతం ఇస్తామంటూ రష్యా తరఫున కొందరు ఏజెంట్లు ప్రచారం చేస్తున్నట్లు ఆ కథనం తెలిపింది. టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ ప్రచారం సాగుతున్నట్లు పేర్కొంది.

ఇప్పటివరకు కనీసం 18 మంది అమెరికా పౌరులను రష్యా దళాల్లోకి నియమించినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. వీరిలో కొందరు మాజీ సైనికులు కూడా ఉన్నట్లు తెలిపింది.

అమెరికాలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారితో పాటు అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ నియామకాలు సాగుతున్నట్లు ఉక్రెయిన్‌ నిఘా వర్గాలు ఆరోపించినట్లు కథనం పేర్కొంది. రష్యా సైన్యంలో చేరిన విదేశీయులను యుద్ధంలో ముందువరుసలో మోహరిస్తున్నారని, ఫలితంగా కొందరు సైన్యంలో చేరిన కొద్దికాలానికే మరణించినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి.

రష్యాకు మరో 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు?

ఇదిలా ఉంటే, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఉత్తరకొరియా సైనికుల ప్రమేయంపై కూడా చర్చ కొనసాగుతోంది. రష్యా తరఫున పోరాడేందుకు మరో 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులను పంపేందుకు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆరోపించారు.

గతంలోనూ జెలెన్‌స్కీ ఇదే తరహా ఆరోపణలు చేశారు.యితే విదేశీయుల నియామకానికి సంబంధించిన గణాంకాలు, ఆరోపణలను స్వతంత్రంగా ధ్రువీకరించడం కష్టంగా ఉండటంతో.. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వెలువడుతున్న వ రష్యాకు ఉత్తరకొరియా నుంచి 50 వేల మంది వరకు సైనికులు వచ్చే అవకాశం ఉందని గతంలో ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, రష్యా దళాల తరఫున పోరాడుతున్న 135 దేశాలకు చెందిన సుమారు 29 వేల మంది విదేశీయులను గుర్తించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

అయితే విదేశీయుల నియామకానికి సంబంధించిన గణాంకాలు, ఆరోపణలను స్వతంత్రంగా ధ్రువీకరించడం కష్టంగా ఉండటంతో.. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వెలువడుతున్న వాదనలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *