తెలంగాణ(Telangana)లోని నిరుద్యోగ యువతకు మరో భారీ శుభవార్త అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పలు శాఖల్లో మొత్తం 290 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలలో రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులు, అలాగే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.


ఇదే సమయంలో మరో 1,597 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 1,800 పోస్టుల భర్తీకి జూన్ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. రెండు రోజుల క్రితం 290 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్, ఇప్పుడు మరో 1,597 పోస్టుల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.


ఈ భారీ నియామకాల ప్రతిపాదనకు సంబంధించిన ఫైలును సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆమోదించినట్లు సమాచారం. దీంతో ఉద్యోగ నియామకాల బోర్డు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భర్తీ చేయనున్న 1,597 పోస్టుల్లో 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు, 24 డిప్యూటీ డీఈవో పోస్టులు, 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నట్లు సమాచారం.

By Mamatha

One thought on “TS Govt Jobs: తెలంగాణలో 1597 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?”
  1. […] తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తియైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమ సమయంలో ప్రజలు ఆశించిన లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయనే అంశంపై ఇప్పటికే చర్చ మొదలైంది. అదే సమయంలో కేవలం తెలంగాణ ఉద్యమం చుట్టూనే కాకుండా అభివృద్ధి, పాలన, భవిష్యత్ దిశ వంటి అంశాలపై కూడా రాజకీయ చర్చ జరగాలనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.ఇలాంటి పరిస్థితుల్లో జనసేన (Jana sena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలంగాణ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో చురుకైన పాత్ర పోషిస్తానని ప్రకటించడంపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *