వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గత ఆరు గంటలుగా ఈ వాయుగుండం గంటకు 3 కిలోమీటర్ల నెమ్మదిగా కదులుతూ సాగర్ ద్వీపానికి 30 కి.మీ, దిఘాకు 70 కి.మీ, డైమండ్ హార్బర్‌కు 90 కి.మీ, కానింగ్‌కు 110 కి.మీ, బాలాసోర్‌కు 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి బాలాసోర్-కానింగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు రుతుపవన ద్రోణి కూడా దీని గుండా ఈశాన్య బంగాళాఖాతం వైపు సాగుతోంది.
ప్రాంతాల వారీగా వాతావరణ వివరాలు:
1. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
- వర్ష సూచన: రాబోయే 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరుతో పాటు భారీ వర్షాలు పడే అవకాశముంది.
- గాలులు: గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
- ఇతర ప్రభావం: ఉరుములు, మెరుపులతో పాటు గాలిలో వేడి, తేమ పెరిగి అసౌకర్య వాతావరణం ఏర్పడవచ్చు.
2. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
- వర్ష సూచన: ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురవవచ్చు.
- గాలులు: గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుంది.
3. రాయలసీమ:
- వర్ష సూచన: రాబోయే మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.
- గాలులు: గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణ పరిస్థితి:
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ వాతావరణం మారనుంది.
- హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడవచ్చు.
- వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
