పసిడి ప్రేమికులకు పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్! గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వినియోగదారులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు, ఒక్కసారిగా మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలుముకోవడం, అమెరికా-ఇరాన్ మధ్య సైనిక దాడులు తీవ్రతరం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గ్లోబల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, చమురు ధరల భగ్గుమంట, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు మన దేశీయ బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. జులై 19 ఆదివారం ఉదయం నాటికి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో పసిడి, వెండి ధరల వివరాలు ఇవే:
అంతర్జాతీయ మార్కెట్లో…
గ్లోబల్ మార్కెట్లో పసిడి కదలికలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి:
- స్పాట్ గోల్డ్ (ఔన్స్): నిన్న ఒక్కరోజే $30 మేర పెరిగి, ప్రస్తుతం $4,017 వద్ద ట్రేడవుతోంది.
- స్పాట్ సిల్వర్ (ఔన్స్): $55.90 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ & విజయవాడ నగరాల్లో ధరలు
శనివారం నాడు భారీగా పెరిగిన ధరలు, ఆదివారం నాటికి ఏ మార్పూ లేకుండా అదే గరిష్ఠ స్థాయి వద్ద స్థిరంగా ముగిశాయి.
బంగారం ధరలు (10 గ్రాములు / తులం):
- 24 క్యారెట్ల మేలిమి బంగారం: క్రితం రోజు ఏకంగా రూ.760 పెరిగిన గోల్డ్, ప్రస్తుతం రూ.1,43,290 వద్ద కొనసాగుతోంది.
- 22 క్యారెట్ల బంగారం: ఎలాంటి మార్పు లేకుండా రూ.1,31,350 వద్ద అమ్ముడవుతోంది.
వెండి ధరలు (1 కేజీ):
గత రెండు రోజులుగా కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా సాగుతోంది.
- హైదరాబాద్ & విజయవాడలో కేజీ వెండి: రూ.2,35,000 వద్ద ట్రేడవుతోంది.
