Bank Holidays: ఆగస్టులో బ్యాంక్‌లకు వరుస సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా?

మరో కొద్ది రోజుల్లో జూలై నెల ముగిసి ఆగస్టు ప్రారంభం కానుంది. కొత్త నెలలోకి అడుగుపెడుతున్న వేళ బ్యాంకింగ్ పనులు ఉన్నవారికి ముఖ్యమైన అలర్ట్! ఆగస్టు నెలలో పండుగలు, వారాంతపు సెలవులు (ఆదివారాలు, రెండవ & నాల్గవ శనివారాలు) కలిపి మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

అత్యవసర బ్యాంకింగ్ లావాదేవీలు ఉన్నవారు ఈ సెలవుల జాబితాను చూసుకుని ముందే తమ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.

ఆగస్టు 2026 బ్యాంక్ సెలవుల జాబితా:

  • ఆగస్టు 02 (ఆదివారం): వారంతపు సెలవు
  • ఆగస్టు 08 (రెండవ శనివారం): బ్యాంక్ సెలవు
  • ఆగస్టు 09 (ఆదివారం): వారంతపు సెలవు
  • ఆగస్టు 15 (శనివారం): స్వాతంత్ర్య దినోత్సవం (జాతీయ సెలవు)
  • ఆగస్టు 16 (ఆదివారం): వారంతపు సెలవు
  • ఆగస్టు 22 (నాల్గవ శనివారం): బ్యాంక్ సెలవు
  • ఆగస్టు 23 (ఆదివారం): వారంతపు సెలవు
  • ఆగస్టు 25 (మంగళవారం): మిలాద్-ఉన్-నబీ
  • ఆగస్టు 30 (ఆదివారం): వారంతపు సెలవు

సెలవు రోజుల్లో డిజిటల్ సేవలు లభ్యం:

శాఖలు మూసివేసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి:

  • ఏటీఎం (ATM) సేవలు యథావిధిగా పనిచేస్తాయి.
  • UPI (PhonePe, Google Pay, PayTM మొదలైనవి) లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
  • నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా నగదు బదిలీ లేదా ఇతర సేవలను అంతరాయం లేకుండా పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *